వనపర్తిలో మండిపోతున్న ఎండలు
వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. 21 కేంద్రాల్లో సోమవారం నుంచి మంగళవారం వరకు నమోదైన వివరాల్లో దగడలో అత్యధికంగా 39.1 డిగ్రీలు నమోదయ్యాయి. గోపాల్పేట, రేవల్లి 39.0, శ్రీరంగాపూర్, కానాయపల్లి, వీపనగండ్ల 38.8, పెద్దమందడి 38.7 డిగ్రీలు నమోదయ్యాయి.ఇతర ప్రాంతాల్లో కూడా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.