గుండెపోటుతో రైతు మృతి
KDP: కలసపాడు మండలం మహానంది పల్లెకు చెందిన దారం చలపతి అనే వ్యక్తి ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్య, కుమారుడు ఇద్దరు మృతి చెందగా కుమారుని పిల్లలను ఆయనే పోషిస్తున్నట్లు సమాచారం. ఆయన మృతి చెందడంతో పిల్లలు రోడ్డున పడ్డారు. ఆయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.