VIDEO: కంభంలో డ్రగ్స్‌పై అవగాహన పోస్టర్ విడుదల
ప్రకాశం: కంభం పట్టణంలో ముస్లిం యూత్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో "Say No to Drugs" అనే కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ కట్టడి పోస్టర్ను ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఎస్సై మాట్లాడుతూ.. డ్రగ్స్ వ్యసనం నుంచి యువతను దూరంగా ఉంచేందుకు పోలీస్ విభాగం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పట్టణ ముస్లిం యూత్ సభ్యులు పాల్గొన్నారు.