అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

KMM: సత్తుపల్లి మండలంలోని సదాశివునిపాలెంలో స్థానికుడు కర్నాటి భద్రం తన గ్రామంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసుకుని ఆటోలో మంగళవారం ఏపీకి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ దాడి చేసి పట్టుకున్నారు. బియ్యంతో సహా ఆటోను స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి. కిరణ్ తెలిపారు.