కౌన్సెలింగ్ గడువు పెంపు
AP: రాష్ట్రంలో MBBS/BDS యాజమాన్య కోటా సీట్లకు 'స్ట్రే' (మిగులు) విడత కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లకు గడువును విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ పొడిగించింది. గడువు గురువారం పూర్తికావాల్సి ఉండగా పెంచింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.