ముద్దనూరు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

ముద్దనూరు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

కడప జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ముద్దనూరు దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనడంతో చిలమకూరుకి చెందిన హాజీవలి (32) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు ఉన్న మరొక వ్యక్తి గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.