జిల్లాలో రెండు చిరుత పులుల కలకలం..!

MBNR: జిల్లా నవాబుపేట మండలం సమీపంలోని దేవరగట్టులో 3 రోజులుగా 2 చిరుత పులులు సంచరిస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని, అటవీ శాఖ అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా వాటిని బంధించాలన్నారు. స్థానిక గుట్టపై చిరుత పులులు సంచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.