లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

MBNR: రాజీ మార్గమే రాజమార్గమని శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి కోరారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీపడ దగ్గ క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, వాహన ప్రమాద కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. అలాగే కోర్టు ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవాలని ఆమె సూచించారు.