బంద్ సందర్భంగా రోడ్లపైనే వంటావార్పు

అల్లూరి: ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ కోసం ఆదివాసీ సంఘాలు రెండు రోజుల నుంచి రాష్ట్ర మన్యం బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు హుకుంపేట, పాడేరు మండల కేంద్రాల్లో రోడ్లపైనే వంటావార్పు చేశారు. ప్రజాప్రతినిధులు సైతం రోడ్లపైనే భోజనాలు చేస్తున్నారు. శనివారం కూడా ఓ వైపు బంద్ నిర్వహిస్తూ, మరోవైపు వంటావార్పు చేస్తున్నారు.