రైలు కింద పడి యువకుడు దుర్మరణం
NLR: కావలి జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ టీషర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్‌పీ పోలీసులను సంప్రదించాలని వారు పేర్కొన్నారు.