నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
HYD: రంజాన్ మాసం చివరి శుక్రవారం 'జుమాతుల్ విదా' ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ చుట్టూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనాల మళ్లింపులు అమలులో ఉంటాయి. మదీనా, హిమ్మతురా, చౌక్ మైదాన్, ఏతబార్ చౌక్ తదితర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. వాహనదారులు ప్రత్నామ్యాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.