మీ ఆడబిడ్డగా అడుగుతున్నా.. ఆదరించండి: MLA
KMM: సత్తుపల్లి కొత్తూరులో ఎన్నికల ప్రచారంలో MLA మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మీ ఆడబిడ్డగా అడుగుతున్నా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఆదరించండి అని ఆమె కోరారు. సర్పంచ్ అభ్యర్థి ఐనంపూడి శ్రీనివాస్ గెలుపును కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేశారు. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి చేసిన కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తే మరిన్ని ప్రయోజనాలు అందిస్తామన్నారు.