'మావిగన్' అంటే ప్రభుత్వం ఉలిక్కిపడింది: కన్నబాబు
AP: మాజీ సీఎం జగన్ 'మావిగన్' అంటే ప్రభుత్వం ఉలిక్కిపడిందని మాజీమంత్రి కన్నబాబు ఆరోపించారు. జగన్ మాట ఎంత పవర్ ఫుల్ అనేది వారికి ఇప్పుడు అర్ధమైంది అని పేర్కొన్నారు. జగన్ ప్రతిపాదనలో తప్పేముంది అని ప్రశ్నించారు. మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తుందని సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మావిగన్‌తో అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.