'రాజన్న హుండీ ఆదాయం 1,65,84,607 రూపాయలు'

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. 1కోటి 65లక్షల 84వేల 607 రూపాయలు వచ్చినట్లు ఈవో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానుకల రూపంలో బంగారం 204 గ్రాములు, వెండి 13కిలోల 200 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. ఆలయ ఈఓ కె. వినోద్, కరీంనగర్ సహాయక మిషనర్ కార్యాలయ అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కించారు.