పలువురు కేంద్రమంత్రులను కలిసిన లోకేష్

పలువురు కేంద్రమంత్రులను కలిసిన లోకేష్

AP: మంత్రి లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిశారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రం గట్టెక్కేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం కేంద్ర ఓడలు, జల రవాణాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు.