'అమ్మాపురం వైకుంఠధామంలో వసతులు కరువు'
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో గత ప్రభుత్వంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామం సమస్యలకు నిలయంగా మారింది. వైకుంఠధామానికి విద్యుత్ సౌకర్యం లేదు. స్నానపు గదులు నిర్మించినప్పటికీ నీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. దీంతో అంతిమయాత్రకు వచ్చే మృతుల బంధువులు స్నానాల కోసం బోర్ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.