విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

NZB: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎర్రగడ్డ (SR నగర్)లోని విజయలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనంతో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.