గంటకు పైగా చీకట్లోనే విధులు
JGL: జిల్లాలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కరెంట్ లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. గంటకు పైగా కరెంట్ పోవడంతో కంప్యూటర్లన్ని ఆఫ్ అయ్యాయి. సిబ్బంది చీకట్లోనే ఫోన్ టార్చ్‌లైట్‌లో పని చేశారు. అలాగే పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజూ వందలాది మంది వచ్చే ఈ కార్యాలయంలో కరెంట్ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.