శ్రీ ఐశ్వర్యాంబిక మహాదేవిగా భగళాముఖి అమ్మవారు

GTR: పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగళాముఖి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం శ్రీ ఐశ్వర్యాంబిక మహాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.