రఘురామపై దాడిని ఖండించిన పవన్
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. దాడి వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానాలున్నాయని తెలిపారు. ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించాలన్నారు. విచారణ జరిపి నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.