గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన RDO

బాపట్ల పట్టణంలోని గురుకుల పాఠశాలను బాపట్ల RDO గ్లోరియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వసతి గృహం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులను తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.