VIDEO: కేటీఆర్ వ్యాఖ్యలకు యూత్ కాంగ్రెస్ ఆందోళన
జనగామ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన “రాహుల్ గాంధీని ఉరి తీయాలి” అనే వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. గురువారం ఆర్టీసీ చౌరస్తాలో కేటీఆర్ కటౌట్ ను ఉరితీసిన నాయకులు, అనంతరం రాహుల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాబిషేకం చేశారు.