'ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కష్టాన్ని తీర్చాలి'

ADB: ఉట్నూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కరువైందని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఇసుక అనుమతులు ఇప్పించాలని రాష్ట్ర మంత్రి వివేక్‌ను ఎమ్మెల్యే కోరారు. గురువారం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ రాష్ట్ర మంత్రి వివేక్‌ను కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు.