VIDEO: యువకుడి మృతదేహం లభ్యం

VIDEO: యువకుడి మృతదేహం లభ్యం

BHNG: బొమ్మలరామారం మండలం మర్యాలలో విషాదం చోటుచేసుకుంది. కురుమనుకుంట చెరువులో గల్లంతైన నందులాల్ (23) మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం చెరువులో స్నానానికి వెళ్లిన నందులాల్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీశైలం ఆధ్వర్యంలో పోలీసులు, రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టగా, అతడి మృతదేహం దొరికింది.