ఉచిత కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభించిన ఎమ్మెల్యే

KKD: శంఖవరం గ్రామంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సాధికారత సాధనలో భాగంగా వారికి ఈ కుట్టు మిషన్ శిక్షణా తరగతులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.