ఆరు జాతి కుక్కలపై నిషేధం
ప్రమాదకరమైన కుక్కుల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికన్ బుల్ డాగ్, అమెరికన్ పిట్ బుల్, బుల్ టెర్రియర్ సహా ఆరు జాతుల కుక్కలను పెంచడాన్ని నిషేధిస్తూ జీఓను జారీ చేసింది. అయితే ఇప్పటికే వీటిని పెంచుతున్న వారికి మాత్రం ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.