'బాలల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు'

'బాలల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు'

ప్రకాశం: ఎవరైనా బాలల హక్కులకు భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని సీడీపీవో సరోజిని అన్నారు. మంగళవారం బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా పీసీపల్లి మండలంలోని పెదర్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. విద్య హక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కులపై అవగాహన కల్పించారు.