హిట్ టీవీ కథనానికి స్పందన
VZM: కొత్తవలస పరిధిలోని తుమ్మికాపల్లి పంచాయతీలో కళాశాలకు వెళ్లే దారిలో ఓ వ్యక్తి అతిపెద్ద స్పీడ్ బ్రేకర్ వేశారని శనివారం హిట్ టీవీలో ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ వార్తకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి వి.రాజ్ కుమార్ తక్షణమే తొలగించాలని వ్యక్తిని ఆదేశించారు. దీంతో ఆదివారం స్పీడ్ బ్రేకర్‌ను తొలగించారు.