బజాజ్ ఫైనాన్స్ రికార్డ్ లోన్లు
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ NBFC కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్ సమయంలో రికార్డు స్థాయిలో రుణాలను జారీ చేసింది. గతేడాదితో పోలిస్తే 27 శాతం ఎక్కువ లోన్లు, విలువ పరంగా 29 శాతం అధికంగా ఇచ్చింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వ్యక్తిగత ఆదాయపు పన్ను ప్రయోజనాల కారణంగా రుణాల విషయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది.