'ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్వార్ సర్దార్ పాపన్న'

JGL: బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్వార్ సర్దార్ పాపన్న గౌడ్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మల్లాపూర్ మండలం, సిరిపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.