పల్లెగడ్డ తండాలో బీజేపీలోకి భారీ చేరికలు
NRPT: మద్దూరు మండల పరిధిలోని పల్లెగడ్డ తండాలో ఆదివారం భారీగా చేరికలు జరిగాయి. మండల అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో తండాకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై యువత పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.