ముడి చమురుపై అమెరికాకు భారత్ కౌంటర్
రష్యా నుంచి చమురు కొనేందుకు అనుమతి ఇవ్వడంపై అమెరికాకు భారత్ కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు ఏ దేశం నుంచైనా చమురును కొనేందుకు హక్కు ఉందని తెలిపింది. ముడిచమురును భారత్ 27 నుండి 40 దేశాల నుంచి కొంటుందని స్పష్టం చేసింది. చమురు కొనుగోళ్ల కోసం భారత్ ఏ దేశం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. రష్యా ఆయిల్ కొనుగోలు కోసం భారత్ ఏ దేశం అనుమతి కోసం ఆధారపడలేదని చెప్పింది.