నరసరావుపేటలో 'ఆత్మ నిర్భర భారత్' కార్యశాల
PLD: నరసరావుపేటలో జిల్లా స్థాయి 'ఆత్మ నిర్భర భారత్' కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 'ఆత్మ నిర్భర భారత్' కోస్తాంధ్ర ఇంఛార్జ్ అశోక్ రాజు మాట్లాడుతూ.. వోకల్ ఫర్ లోకల్ అని, ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులనే వాడాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శశి కుమార్, అన్ని మండలాల కన్వీనర్‌లు పాల్గొన్నారు.