స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు సన్మానం

WNP: బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి సమరయోధుల కృషి మరువలేనిదని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వనపర్తి సమరయోధుల కుటుంబాలను ఘనంగా సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పాల్గొన్నారు.