'నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి'

'నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి'

MHBD: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 6న ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ డెవలప్‌మెంట్ మేనేజర్, టీం లీడర్, లైఫ్ మిత్ర పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి టి.రజిత ఇవాళ తెలిపారు. అర్హులు 6వ తేదీ ఉదయం 10 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.