'ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు'
PDPL: జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి శారద ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉ. 8 గంటల నుంచి మ. 12:30 వరకు తరగతులు నిర్వహించాలని తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రం గల పాఠశాలలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు.