VIDEO: ఆర్టీసీ బస్సు ఢీకొని.. గేదే మృతి

NGKL: జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ క్రస్ రోడ్ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ గేదె మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో సుమారు రూ.80 వేలు విలువైన పాడి గేదె అక్కడికక్కడే చనిపోయిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం తమను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.