VIDEO: ఔరా అనిపించిన 4 వ తరగతి విద్యార్థిని
ADB: తాంసి మండలంలోని పొన్నారి ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఔరా అనిపించింది. తెలుగు సబ్జెక్ట్‌లో 83 పదాలను ఒక్క నిమిషంలోనే నిర్విరామంగా ఎటువంటి తప్పులు దొర్లకుండా చదివేసింది. ఈ మేరకు పలువురు ఆమెను అభినందించారు. మరింత పట్టుదలతో ముందుకు సాగాలని ఉపాధ్యాయులు సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన అందిస్తున్నామని తెలిపారు.