కుక్కలను తరలించిన మున్సిపల్ సిబ్బంది

కుక్కలను తరలించిన మున్సిపల్ సిబ్బంది

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలో కుక్కల బెడద అధికం కావడంతో మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ సిబ్బంది కుక్కలను తరలించారు. కుక్కలను చాకచక్యంగా పట్టుకొని, వాటిని ఇతర ప్రాంతంలో వదిలేస్తున్నారు. పట్టణంలో కుక్కలు విచ్చలవిడిగా పెరిగిపోయి వృద్ధులు, చిన్న పిల్లలను కాటు వేయడంతో పట్టణవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.