ప్రజాభవన్‌లో జరిగే ప్రజావాణి వాయిదా

HYD: మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో ఈనెల 15న జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాయిదా వేస్తున్నట్లు ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య తెలిపారు. 19వ తేదీన తిరిగి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి శుక్రవారం కాకుండా వచ్చే మంగళవారం ప్రజావాణి కార్యక్రమానికి రావాలన్నారు.