పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
NLG: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఇంధన కొరత ఏర్పడింది. నార్కట్‌పల్లిలోని పెట్రోల్ బంక్‌లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయిందని బంక్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఇంధనం దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ లేక భారీ వాహనాల యజమానులు కిరాయిలు సైతం రద్దు చేసుకుంటున్నారు.