ప్రేమ విషయంలో యువతిపై దాడి
MNCL: కాసిపేట మండలం రొట్టెపల్లిలో ఓ యువతిపై దాడి జరిగింది. దేవాపూర్ SI గంగారాం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోగుల అక్షిత్, అలక అక్షిత ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి రహస్య వివాహం చేసుకున్నారు. దీంతో బుధవారం రాత్రి అక్షిత్ సోదరి సదాపై అమ్మాయి బందువులు కలిసి దాడి చేశారు. సదా ఫిర్యాదు మేరకు SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.