రాజీపడని సిద్ధాంతాలతో ఎదిగిన నేత సురవరం: సీఎం

రాజీపడని సిద్ధాంతాలతో ఎదిగిన నేత సురవరం: సీఎం

MBNR: రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాలలో ఎదిగిన నేత పాలమూరుబిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన మరణం తీరనిలోటు అని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని సీఎం సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన సుధాకర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తించుకునే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు.