భారత్‌కు 3 గిన్నిస్ రికార్డులు.. ఎందుకంటే?

భారత్‌కు 3 గిన్నిస్ రికార్డులు.. ఎందుకంటే?

భారత్ మహిళల ఆరోగ్య సంరక్షణ రంగంలో రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహించిన 'స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమం 3 గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 19.7 లక్షలకుపైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించగా.. 11 కోట్లకు పైగా ప్రజలు సేవలు పొందారని నడ్డా వివరించారు.