'చిల్పూరులో సబ్ మార్కెట్ ఏర్పాటు చేయాలి'
JN: చిల్పూరు మండల కేంద్రంలో సబ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని CPM మండల పార్టీ కార్యదర్శి సాధం రమేష్ అన్నారు. చిల్పూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేతలు నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండలంలో రైతుల పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, రైతు సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.