'రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు'

'రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు'

KRNL: మంత్రాలయంలో రామచంద్ర నగర్‌కి చెందిన వైసీపీ కార్యకర్త రామకృష్ణ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే తనయుడు ప్రదీప్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.