VIDEO: శివనామస్మరణతో మార్మోగిన క్షీరారామం
W.G; పవిత్ర కార్తీకమాసం నాలుగో సోమవారం సందర్భంగా పంచారామక్షేత్రం పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు చేసి, పంచామృతాభిషేకాలు, గోత్రనామార్చనలు, నిత్యాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీకమాసంలో చివరి సోమవారం కావడంతో, తెల్లవారు నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.