తడి, పొడి చెత్తపై గ్రామస్తులకు అవగాహన

తడి, పొడి చెత్తపై గ్రామస్తులకు అవగాహన

VZM: కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం, దత్తి, దన్నీన్ని పేటలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.వి.సత్యనారాయణ బుధవారం సందర్శించారు. ముందుగా గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌లను పరిశీలించారు. తడి, పొడి చెత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పారిశుధ్య సిబ్బందిపై ఆరా తీశారు. సర్పంచ్ కోన దేముడు, డిప్యూటీ ఎంపీడీవో శ్రీదేవి, సెక్రటరీ దీపిక పాల్గొన్నారు.