MSC రుణాలతో అభివృద్ధి చెందుతున్న ఉమ్మడి జిల్లా
WGL: డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు నాయకత్వంలో ఉమ్మడి జిల్లా పీఏసీఎస్ సంఘాలు ఎంఎస్సీ రుణాలతో బలోపేతమవుతున్నాయి. పెట్రోల్ బంకులు, గోదాంలు, వ్యవసాయ ఔట్‌లెట్లు, మార్కెట్లు, ఫంక్షన్ హాల్స్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 129 ఆస్తుల్లో 30 పూర్తయి ఆదాయం అందిస్తున్నాయి. గోదాంలు రైతులకు నిల్వ సౌకర్యంగా ఉపయోగాపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.