జిల్లాలో దొంగల బీభత్సం.. పది రోజుల్లో నాలుగు చోరీలు
ASF: జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లతో పాటు ఒంటరిగా ఉంటున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారు. గత పది రోజుల్లో జిల్లాలో నాలుగు దొంగతనాలు జరిగాయి. కాగజ్ నగర్ నియోజకవర్గంలో రెండు, ఆసిఫాబాద్‌లో రెండు చోట్ల దొంగతనాలు జరిగాయి.